PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నవంబర్‌ 15 నుంచి డిసెంబర్‌ 15 వరకూ ఆరోగ్య శ్రీ  ప్రచారం..

1 min read

ఆరోగ్య శ్రీ సేవలు ఎలా పొందాలన్న దానిపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలి…

సీఎం వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు : జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రత్యేక ప్రాధాన్యతతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ వైద్యాధికారులను ఆదేశించారు.  సోమవారం తాడేపల్లి నుండి జగనన్న ఆరోగ్య సురక్ష, ఆరోగ్యశ్రీ కార్యక్రమాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు ఏలూరు జిల్లా కలెక్టరేట్ వి.సి.హాలు నుంచి జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్, డిఎంహెచ్ఓ డా. ఎస్. షర్మిష్ట, జెడ్పి సిఇఓ కె. సుబ్బారావు, డి.సి.హెచ్ఎస్ డా. పాల్ సతీష్, హాజరయ్యారు.  వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ముఖ్యమంత్రి శ్రీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి అందించిన మార్గదర్శకాలమేరకు సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పలుసూచనలు జారీ చేశారు. జనవరి నెల నుండి నూతన ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీకి సంబంధించి వైద్య ఆరోగ్యశాఖాధికారులు సంబంధిత డేటాను అప్ డేట్ చేసుకోవాలన్నారు.  తొలుత రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ నవంబర్‌ 15 నుంచి డిసెంబర్‌ 15 వరకూ ఆరోగ్యశ్రీ పై అవగాహన కల్పించే ప్రచారం నిర్వహించి ఆరోగ్యశ్రీ సేవలు  ఎలా పొందజాలన్నదానిపై ప్రతి ఒక్కరికి తెలియజేయాలన్నారు.  ప్రతి ఒక్కరి ఫోన్ లో ఆరోగ్య యాప్ ఉండేలా చూడాలన్నారు.  ఆరోగ్య శ్రీ చికిత్స కోసం ఎక్కడకు వెళ్లాలన్నదానిపై పూర్తి వివరాలు ఈ యాప్‌లో ఉంటాయి. దీనిపై ఎలాంటి సందేహాలు ఎవ్వరికీ ఉండకూడదు. యాప్‌లోకి వెళ్తే సమీపంలోని ఎంపానెల్‌.. ఆస్పత్రికి మార్గం చూపిస్తుందన్నారు. లేకపోతే విలేజ్‌ క్లినిక్‌ను అడిగినా, అలాగే 104ను అడిగినా తగిన రీతిలో గైడ్‌ చేస్తారన్నారు. ఆరోగ్య శ్రీ సేవలను ఎలా పొందాలన్నదానిపై బుక్‌లెట్స్‌కూడా ప్రతి కుటుంబానికీ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,295 ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు అందుతున్నాయన్నారు. అయినా వైద్యంకోసం ప్రజలు ఎందుకు తమ జేబుల్లోనుంచి డబ్బులు ఖర్చుచేసుకోవాల్సిన అవసరం ఏముంది?. అలాంటి పరిస్థితులు ఇకపై లేకుండా చూడటం మన అందరి బాధ్యత అన్నారు. ఆ దిశగా అడుగులు వేసే లక్ష్యంతోనే జగనన్న ఆరోగ్య సురక్ష తీసుకొచ్చామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

About Author