PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆరోగ్యశ్రీ సేవలను మరింత పటిష్టంగా అమలు చేయాలి

1 min read

ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.V.వెంకటరంగా రెడ్డి,  మాట్లాడుతూ:

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ధనవంత్రి హాల్ లో వివిధ విభాగాల HODs తో ఆరోగ్యశ్రీ మరియు ఈ హాస్పటల్ లపై సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు.ఆసుపత్రిలోని పలు విభాగాలలో ఆరోగ్యశ్రీ ప్రతి వారం ఇచ్చే టార్గెట్లను పూర్తిచేసిన సందర్భంగా వారికి అనంతరం ఆరోగ్యశ్రీ సేవలను మరింత పటిష్టంగా అమలు చేసిన  పలు విభాగాల హెచ్.ఓ డీ లను అభినందించినట్లు తెలిపారు.ఆసుపత్రిలోని గైనిక్ డిపార్ట్మెంట్ విభాగాల ఈ హాస్పిటల్ మరింత ఇంప్రూవ్మెంట్ చేయాలి అని సంబంధించిన Hods లను ఆదేశించారు. ఆసుపత్రిలోని ఈ హాస్పిటల్ ఇంప్లిమెంటేషన్ 60% నుంచి 75% చేసినందుకు సంబంధించిన హెచ్చోడిలకు అభినందించారు అనంతరం రాష్ట్రంలోనే నెంబర్ వన్ ఈ హాస్పిటల్ ఇంప్లిమెంటేషన్ చేయనున్నట్లు తెలియజేశారు.ఆసుపత్రి లో CT సిటీ స్కాన్ మరియు MRIస్కాన్ కు సంబందంచిన లో రిక్వెషన్ ఫామ్ లో పేషెంట్ కు సంబంధించిన స్కానింగ్ లకు ప్రాపర్ గా మెయింటైన్ చేయాలని అనంతరం పేషెంట్ కు అవసరాల బట్టి స్కానింగ్ అడ్వైస్ చేయాలని సంబంధించిన హెచ్చోడిలను ఆదేశించారు. క్యాజువాలిటీ విభాగంలోని CMO లను సంబంధించిన సంబంధిత  CT సిటీ స్కాన్ మరియు ఎక్సరే రిక్వెషన్ ఫామ్ మైంటైన్ చేయాలని CMOS కి ఆదేశించారు.ఆసుపత్రిలోని హౌస్ సర్జన్స్ మరియు పీజీ/ఎస్ఆర్లను అటెండెన్స్  రిజిస్టర్ లపై ప్రాపర్ గా మైంటైన్ చేయాలని సంబంధించిన హెచ్వోడిస్ లను ఆదేశించారు.అన్ని విభాగాలలో పేస్ట్ కంట్రోల్ మరియు శానిటేషన్/ సెక్యూరిటీ సంబంధించిన వాటిల్లో ప్రతిరోజ ఆసుపత్రి పలు విభాగాలను పరిశుభ్రంగా ఉండే విధంగా సంబంధించిన హెచ్వోడీ లను సూపర్వైజింగ్ చేయాలని తెలియజేశారు.కార్డియాలజీ  మరియు కార్డియో థొరాసిక్  విభాగం  లో గత నెల 28/ 11/2023 నాడు ప్రారంభమై క్యాథల్యాబ్ సేవలు ఇప్పటివరకు 28 ఆంజియోగ్రామ్ మరియు మూడు బైపాస్ సర్జరీలు చేసినందుకు హెచ్ఓడీలకు అభినందించినట్లు తెలియజేశారు.ఈ కార్యక్రమానికి  కర్నూలు  వైద్య కళాశాల ప్రిన్సిపాల్, డా.సుధాకర్, ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్, డా.ప్రభాకర్ రెడ్డి, వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్, డా.హరిచరణ్, ఆసుపత్రి CSRMO, డా.వెంకటేశ్వరరావు, డిప్యూటీ CSRMO డా.హేమనలిని, హెచ్వోడీస్, డా.శ్రీనివాసులు డా.సీతారామయ్య, డా. శ్రీలక్ష్మి బాయ్, డా.రాధరాణి, RMO డా.వెంకటరమణ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్, డా.శివబాల నగాంజన్, తదితరులు పాల్గొన్నట్లు, ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.V.వెంకటరంగా రెడ్డి,  తెలిపారు.

About Author