కొల్లేటికోట శ్రీ పెద్దింటి అమ్మవారి వార్షిక జాతర ఉత్సవాల కి ఏర్పాట్లు..
1 min read11-3-2024 వ తేదీ నుండి 24-3-2024 తేదీ వరకు
వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం
సెక్యూరిటీ గార్డ్స్ ఏర్పాటుకు టెండర్లు..
కార్యనిర్వాహణాధికారి కె.వి గోపాలరావు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు జిల్లా కైకలూరు మండలం కొల్లేటికోట గ్రామంలో వేంచేసియున్నా శ్రీ పెద్దింటి అమ్మవారి వార్షిక జాతర ఉత్సవములు ది. 11.03.2024 వతేది నుండి ది.24-03-2024 వతేదీ వరకు జరుపబడు సందర్బంగా ఈరోజు మద్యహనం గం. 3.45 తాటియకు పందిరి రాట ముహూర్తం జరిపించి తదుపరి జాతర ఉత్సవములలో అధిక సంఖ్యలో వచ్చు భక్తుల సౌకర్యార్ద చేయవలసిన ఏర్పాట్లు విషయములను యస్. పోతురాజు , తహశీల్దార్ కైకలూరు వారి అద్యక్షతన శ్రీ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో వివిదశాఖ ల అధికారులతో సమన్వయ సమావేశమును జరిపించినరాని సదరు సమావేశమునకు ముఖ్య అతిధిగా ముంగర సంజీవ్ కుమార్ రాష్ట్ర వడ్డీ కార్పొరేషన్ ఛైర్మన్ మరియు ఎమ్మెల్యే కైకలూరు నియోజకవర్గం వారి కుమారుడు దూలం వీర శ్యామ్ పనికుమార్, మాజీ ధర్మకర్తల మండలి ఛైర్మన్ పూలవర్తి లక్ష్మణ్ మరుయు మాజీ ధర్మకర్తల మండలి సభ్యులు వుడిముడి సుబ్బరాజు, బలే సారంగధర, బలే నరసింహారావు, నేపల వీరకుమారి, మద్దల సుబ్బలక్ష్మి పాల్గొన్నారని. మరియు రేపు అనగా ది.22-02-2024 వతేదీ ఉదయం గం.10.00 ల నుండి తనిఖీ అధికారి వి.సుదకర్ దేవాదాయ ధర్మదయ శాఖ గుడివాడ వారి పర్యవేక్షణలో శ్రీ అమ్మవారి దేవస్థానమునందు నెలకొల్పబడిన హుండీలను తెరచి అందు వచ్చిన కానుకలను లెక్కించబడునని తదుపరి మూడు ఐటం లకు 1. రంగులు సున్నలు వేయుటకు లేబర్ చార్జి నిమిత్తం. 2. రంగులు, సున్నలు, వగైరాలు సప్లయి చేయుటకు 3. శ్రీ అమ్మవారి జాతర ఉత్సవములలో సెక్యూటి గార్డ్స్ ను ఏర్పాటు చేయుటకు గాను టెండర్లను కోరుచున్నము అని ఆలయ కార్యనిర్వహణాధికారి కె.వి గోపాలరావు గారు ఒక ప్రకటనలో తెలియజేసినరు.