నారా లోకేష్ పర్యటన లో పకడ్బందీగా ఏర్పాట్లు
1 min read
మంత్రాలయం, న్యూస్ నేడు: శ్రీ మఠం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థుల తో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ నవ్య, సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, టిడిపి జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి, మంత్రాలయం టీడీపీ ఇంచార్జి మాధవరం రాఘవేంద్ర రెడ్డి, కేయి ప్రభాకర్, కుడా ఛైర్మెన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు .విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నేడు గురు రాఘవేంద్ర వైభవోత్సవాల్లో పాల్గొనేందుకు మంత్రాలయం కు వస్తున్న నేపథ్యంలో శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థుల తో కలిసి జాయింట్ కలెక్టర్ నవ్య, సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, టిడిపి జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి, మంత్రాలయం టీడీపీ ఇంచార్జి మాధవరం రాఘవేంద్ర రెడ్డి, కేయి ప్రభాకర్, కుడా ఛైర్మెన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, డిఎస్పీ ఉపేంద్ర బాబు, సిఐ రామాంజులు ఏర్పాట్ల ను పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీ మఠం ప్రాంగణం, మఠం బయట హెలిపాడ్, నరహరి గెస్ట్ హౌస్ దగ్గర ఏర్పాట్లను పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వీరి వెంట టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి, టిడిపి మండల అధ్యక్షులు పన్నగ వెంకటేష్ స్వామి, ఆదోని ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే ఎన్.మీనాక్షి నాయుడు ,బిసి వెల్ఫేర్ చైర్మన్ నాగేశ్వర యాదవ్, మంత్రాలయం నియోజకవర్గం బిసి సెల్ అధ్యక్షులు పైబావి అమర్నాథ్ రెడ్డి, మఠం అధికారులు వెంకటేష్ జోషి, ఐపి నరసింహ స్వామి, సురేష్, తహసీల్దార్ రవి, ఎస్ఐ శివాంజల్, టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పరిశీలన : – రాష్ట్ర మంత్రి నారా లోకేష్ మంత్రాలయం వస్తున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ మాధవరం రాఘవేంద్ర రెడ్డి తో కలిసి సాయంత్రం ఏర్పాట్లను పరిశీలించారు. మఠం ప్రాకారంలో, హెలిఫ్యాడ్ గ్రౌండ్, బస చేసే నరహరి వసతి గృహ దగ్గర పరిశీలించారు.
