పదవ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
1 min readపొరపాట్లకు తావు లేకుండా చర్యలు
సిట్టింగ్ స్కాడ్ ఫ్లయింగ్స్ స్కాడ్ లు ఏర్పాటు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: జిల్లాలో పదవ తరగతి పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసామని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ తెలిపారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా ప్రత్యేకత చర్యలతో పాటు సిట్టింగ్స్ క్వార్డులు ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు ఆదివారం ఉదయం జిల్లా శాఖ అధికారి విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన తెలిపిన వివరాలు ఎలా ఉన్నాయి జిల్లా నంధు 162 పరీక్ష కేంద్రాలలో 37801 మంది విద్యార్ధులు పరీక్షకు హాజారు అవుచున్నారు . ఈ కేంద్రాలలో 162 మంది చీఫ్ సూపరింటెండెంట్లు మరియు 162 మంది డెపార్ట్మెంటల్ ఆఫీసర్స్ ను నియమించబడ్డారు. 17 సి సెంటర్లకు కాను 13 మంది కస్ట్టోడియన్లను నియమించబడ్డారు మరియు ఫ్త్లెయింగ్ స్క్వాడ్ లు 7 బృందాలను నియమించడమైనది. 162 పరీక్ష కేంద్రాలకు గాను 44 మంధి సిట్టింగ్ స్క్వాడ్ లను నియమించడమైనది. పరీక్షకు సంబంధించి కట్టుధిట్టమైన యేర్పాట్లు చేయడం జరిగింది. డిఈఓ కార్యలయము, కర్నూలు నందు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబడింది. 9398966124 కు సంప్రదించవలెను. ఈ పరీక్షలతో పాటు జరుగుతున్న ఎస్ఎస్సి అండ్ ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ పరీక్షలకు 21 కేంద్రలనందు ౩౭౭౩ మంది విద్యార్ధులు పరీక్షకు హాజారు అవుచున్నారు. ఈ కేంద్రాలలో 21 మంది చీఫ్ సూపరింటెండెంట్లు మరియు 21 మంది డెపార్ట్మెంటల్ ఆఫీసర్స్ ను నియమించబడ్డారు. 21 సెంటర్లకు ఫ్త్లెయింగ్ స్క్వాడ్ లు 5 బృందాలను నియమించడమైనది. 162 పరీక్ష కేంద్రాలకు గాను 44 మంధి సిట్టింగ్ స్క్వాడ్ లను నియమించడమైనది. పరీక్షకు సంబంధించి కట్టుధిట్టమైన యేర్పాట్లు చేయడం జరిగిందని పత్రికా / మీడియా ప్రతినిధుల సమావేశం నందు జిల్లా విద్యా శాఖాధికారి, కర్నూల్ వారు తెలియచేశారు .