మహానంది క్షేత్రం లో కుంభోత్సవానికి ఏర్పాట్లు
1 min read
మహానంది, న్యూస్ నేడు: మహానంది క్షేత్రంలో కుంభోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు విశ్వాసనీయ సమాచారం. గత కొంతకాలం నుంచి ఈ కార్యక్రమం నిర్వహించాలని తలపెట్టిన కొన్ని అడ్డంకుల కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. ఈ కార్యక్రమంలో ప్రధానంగా క్షేత్ర ప్రధాన ఆలయం పై బాగాన ఉన్న కలశం దెబ్బతిని ఉంది. దానిని పునః ప్రతిష్టించడంతోపాటు అమ్మవారి ఆలయంలో కొన్ని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కంచి కామకోటి పీఠాధిపతి చేతుల మీదుగా ఈ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇప్పటికే పీఠాధిపతి అనుమతి కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. గత ఏడాది కంచి కామకోటి పీఠాధిపతి చేతుల మీదుగా నిర్వహించాలని తలపెట్టిన అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. జూన్ ఈనెల 15 లోపు మహానంది క్షేత్రంలో కుంభోత్సవ కార్యక్రమం నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తుంది.