NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పది పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి – మండల విద్యాధికారి

1 min read

ప్యాపిలీ, న్యూస్​ నేడు:  ప్యాపిలి మండలంలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మండలంలోని ఐదు పరీక్షా కేంద్రాలలో మొత్తం 752 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు అనిమండల విద్యాధికారి (ఎఈఓ) తెలిపారు. ఈ పరీక్షలు నిష్పక్షపాతంగా, నిరాయాసంగా నిర్వహించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, విద్యార్థుల సౌకర్యార్థం సముచిత ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల చుట్టుపక్కల 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఎటువంటి అంతరాయం కలిగించకూడదని విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేయడం జరిగింది.పరీక్షా కేంద్రాలు & పరీక్ష కేంద్రాలలో రాస్తున్న విద్యార్థుల సంఖ్య:ప్యాపిలి బాలుర ఉన్నత పాఠశాల – 190 మంది, ప్యాపిలి బాలికల ఉన్నత పాఠశాల – 197 మందిపోతిదొడ్డి సెంటర్ – 68 మంది. రాచర్ల సెంటర్ – 86 మంది. జలదుర్గం సెంటర్ – 210 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు.పరీక్షల నిర్వహణకు సంబంధించి పరీక్షా కేంద్రాల వద్ద అధికారులు పర్యవేక్షణ ఏర్పాటు చేశారు. విద్యార్థులు గడువు సమయానికి హాజరై, పరీక్షా నిబంధనలను పాటించాలని మండల విద్యాధికారి కోరారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *