ఉగాది వేడుకలకు ఏర్పాట్లు…
1 min read
ఈనెల 30న ఏలూరు గిరిజన భవన్ లో శ్రీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది వేడుకలు
జిల్లా కలెక్టర్ కె.వెట్రీసెల్వి
తెలుగు ప్రజల సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఘనంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశం
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు :శ్రీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది వేడుకలను సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఉగాది వేడుకల నిర్వహణపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. శ్రీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది వేడుకలు సాంప్రదాయ బద్దంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఈనెల 30వ తేదీ ఆదివారం ఉదయం 9.30 గంటల నుంచి ఏలూరు గిరిజన భవన్ లో శ్రీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నాధస్వరం, పంచాంగ శ్రవణం, వేదాశీర్వచనం, వేదపండితుల సత్కారం, ఉగాది పచ్చడి, ప్రసాదాల ఏర్పాట్లను దేవాదాయశాఖ నిర్వహించాలన్నారు. తెలుగువారి సంప్రదాయం ఉట్టిపడే విధంగా మామిడి తోరణాలు, అరటిచెట్లతో, పుష్పమాలలతో వేదిక అలంకరణ, బాధ్యతను ఉద్యాన శాఖ, కవిసమ్మెళనం జిల్లా విద్యాశాఖ చేపట్టాలన్నారు. అతిధులకు ఆహ్వానం, వేదికపై బ్యాక్ డ్రాప్,సాంస్కృతిక కార్యక్రమాలు, ఉత్తమ రైతులు, కళాకారులకు సత్కారం, పిఎ సిస్టమ్ తదితర ఏర్పాట్లను టూరిజం, సాంస్కృతిక శాఖ చేపట్టాలన్నారు. వేడుకలు నిర్వహించే గిరిజన భవన్ ప్రాంగణంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో రంగవల్లులు ఏర్పాటు చేయాలని సూచించారు. వేడుకలు నిర్వహించే గిరిజన భవన్ వద్ద శానిటేషన్ కార్యక్రమాలను నగరపాలక సంస్ధ పర్యవేక్షించాలన్నారు.