PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కాలభైరవ స్వామి తిరుణాల సందర్భంగా ఏర్పాట్లు

1 min read

– పూజల్లో ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా బ్యూరో : కాలభైరవ స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రాయచోటి మండలం యండపల్లె సమీపంలో శుక్రవారం జరుగుచున్న కాలభైరవ తిరుణాల సందర్భంగా ఏర్పాటు చేసిన పూజల్లో శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.ఆలయానికి విచ్చేసిన శ్రీకాంత్ రెడ్డి కి ఘన స్వాగతం పలికి ఆయన చేత ప్రత్యేక పూజలు గావింపచేసి తీర్థ ప్రసాదాలు అందించి దుస్సాలువతో సత్కరించారు.మాజీ ఎంపిపి పోలు సుబ్బారెడ్డి, బిసి నాయకుడు పల్లపు రమేష్, ధర్మారెడ్డి,అమరనాధ రెడ్డి,ఎర్రబయన్న, నల్ల బయన్న,కిరణ్, గంగాధర్ రెడ్డి,ఆలయ కమిటీసభ్యులు తదితరులు పాల్గొన్నారు.

About Author