NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అల్ ఖైదా ఉగ్రవాదుల అరెస్ట్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఉత్తర‌ప్రదేశ్ లోని కాకోరిలో ఇద్దరు అల్ ఖైదా ఉగ్రవాదుల‌ను పోలీసులు అరెస్టు చేశారు. ల‌క్నోతో పాటు ఇత‌ర ప్రాంతాల్లో ముష్కరులు ప‌న్నిన ఉగ్రకుట్రను పోలీసులు భ‌గ్నం చేశారు. అల్ ఖైదా సంస్థకు అనుబంధంగా ఉన్న అన్సర్ ఘ‌జ్వత్ ఉల్ హింద్ కి చెందిన ఉగ్రవాదులుగా వీరిని గుర్తించారు. ఆదివారం కాకోరిలో ఏటీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ప‌ట్టుబ‌డ్డ ఉగ్రవాదుల‌ను మ‌సీరుద్దీన్, మిన్హాజ్ గా పోలీసులు గుర్తించారు. వీరిరువురూ ఆత్మాహుతి దాడులు చేయ‌డంలో శిక్షణ పొందిన‌ట్టు పోలీసులు తెలిపారు. వీరి స్థావ‌రం నుంచి రెండు ఫ్రెష‌ర్ కుక్కర్ బాంబులు, ఆయుధాలు, ఓ డిటోనేట‌ర్, 6-7 కిలోల పేలుడు ప‌దార్థాలు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ల‌క్నోలోని ఓ బీజేపీ ఎంపీతో మ‌రికొంద‌రు సీనియ‌ర్ నాయ‌కుల్ని ల‌క్ష్యంగా చేసుకున్నట్టు ప్రాథ‌మిక ద‌ర్యాప్తులో తేలింది.

About Author