PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అక్రమంగా తరలిస్తున్న గోవా మద్యం పట్టివేత

1 min read

పల్లెవెలుగు వెబ్ కృష్ణ:  కృష్ణ మండల కేంద్రంలోని గుడెబాల్లూరు గ్రామ చెకపోస్ట్ దగ్గర బుధవారం రోజు  7 బాటిళ్లు (6.75) లీటర్ లను స్వాధీనం చేసుకున్న -వి.సతీష్ ఎక్సైజ్ సబ్ ఇన్ స్పెక్టర్ఎన్నికల్లో కోడ్ నేపథ్యంలో కృష్ణ ఎక్సైజ్ చెక్ పోస్ట్ పోలీస్ బృందం,ఎస్.ఎస్.బి (సశాస్త్ర సీమ బల్ ) సాయుధ బలగాలు బృందాలతో కలిసి బుధవారం అనుమానాస్పద వాహన తనిఖీలు నిర్వహించారు. ఆ తనిఖిల్లో సుమారు 5,000 రూపాయల విలువైన 7 బాటిళ్లు నాన్ డ్యూటీ పెయిడ్ గోవా మద్యం (6.75) లీటర్ లను సీజ్ చేసి ఒక కేసు నమోదు చేశారు. ఓటర్లను ప్రలోభాలకు పెట్టడానికిఇతర రాష్ట్రాల నుండి తెలంగాణలోకి ఆక్రమంగా మద్యం తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ పోలీస్ సిబ్బందిలు చెప్పారు. ఈ తనిఖీల్లో వి. సతీష్ ఎక్సైజ్ సబ్ ఇన్ స్పెక్టర్, సయ్యద్ బాషా ఎక్సైజ్ కానిస్టేబుల్, సురేష్ పోలీస్ కానిస్టేబుల్, పాల్గొన్నారు.

About Author