టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్
1 min readపల్లెవెలుగు వెబ్: తెలుగుదేశం సీనియర్ నాయకుడు దూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. గుంటూరు జిల్లా చింతలపూడిలోని ఆయన నివాసంలో అరెస్టు చేశారు. తెల్లవారుజామున 100 మంది పోలీసులు ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. నరేంద్ర సంగం డెయిరీ చైర్మన్ గా ఉన్నారు. సంగం డెయిరీలో అక్రమాలు జరిగాయంటూ ఆయన మీద పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. దీంతో ఏసీబీ అధికారులు ఆయనను అరెస్టు చేశారు. సమాచారం లేకుండా అరెస్టు చేయడాన్ని టీడీపీ నేతలు ఖండించారు. కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం టీడీపీ నేతల మీద కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.