NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తీన్మార్ మ‌ల్లన్న అరెస్ట్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : తీన్మార్ మ‌ల్లన్న అలియాస్ చింత‌పండు న‌వీన్ ను పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం రాత్రి తీన్మార్ మ‌ల్లన్నను చిల‌క‌ల‌గూడ పోలీసులు అరెస్టు చేశారు. డ‌బ్బులు ఇవ్వకపోతే చంపేస్తాన‌ని త‌న‌ను తీన్మార్ మ‌ల్లన్న బెదిరించాడ‌ని ఓ వ్యక్తి చిల‌క‌ల‌గూడ పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేశాడు. అప్పట్లో కేసు నమోదు చేసిన పోలీసులు తీన్మార్ మ‌ల్లన్నను స్టేష‌న్ కు పిలిపించి విచారించారు. మ‌రో కేసులో తీన్మార్ మ‌ల్లన్న కార్యాల‌యాన్ని పోలీసులు త‌నిఖీలు చేశారు. సైబ‌ర్ క్రైమ్ పోలీస్ స్టేష‌న్ లో రెండు కేసులు, చిల‌క‌ల‌గూడ‌, జూబ్లిహిల్స్ పోలీస్ స్టేష‌న్లో చెరో కేసు తీన్మార్ మ‌ల్లన్న పై న‌మోద‌య్యాయి. ఈ నేప‌థ్యంలో చిల‌క‌ల‌గూడ పోలీసులు తీన్మార్ మ‌ల్లన్నను అరెస్టు చేశారు.

About Author