PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పాము తిన్నందుకు అరెస్టు..!

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: త‌మిళ‌నాడులోని మ‌ధురైలో చ‌చ్చిన పాము తిన్నందుకు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. పెర‌మ‌ప‌ట్టికి చెందిన వ్యవ‌సాయ కూలీ వ‌డివేలు చ‌చ్చిన పామును తింటున్న వీడియో నెట్లో వైర‌ల్ అయింది. కోవిడ్ నివార‌ణ‌కు పాము తింటున్నట్టు, క‌రోన‌కు పాము విరుగుడుగా ప‌నిచేస్తుంద‌ని ఆ వీడియోలో అత‌డు చెప్పాడు. ఆ వీడియో చూసిన జిల్లా అట‌వీశాఖ అధికారి ఆనంద్ అత‌న్ని అరెస్టు చేయించాడు. దీంతో పాటు వ‌డివేలుకు రూ. 7 వేలు జ‌రిమాన విధించారు.

About Author