NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

26న సీఎం జగన్​ ఓర్వకల్లుకు రాక..

1 min read
ఎయిర్​పోర్ట్​ ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి బుగ్గన, కలెక్టర్​, ఎస్పీ, పాణ్యం ఎమ్మెల్యే

ఎయిర్​పోర్ట్​ ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి బుగ్గన, కలెక్టర్​, ఎస్పీ, పాణ్యం ఎమ్మెల్యే

పల్లెవెలుగు వెబ్​, ఓర్వకల్లు : ఈ నెల 26న ఓర్వకల్ ఎయిర్ పోర్టులోని కమర్షియల్ ఫ్లైట్ ఆపరేషన్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విచ్చేస్తున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గనరాజేంద్రనాథ్​ రెడ్డి, , పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరకాల వలవన్, పాణ్యం ఎమ్యెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు జిల్లా కలెక్టర్ జి.వీరపాండ్యన్, కర్నూలు జిల్లా ఎస్పీ ఫక్కిరప్ప, జేసీ రాం సుందర్​ రెడ్డి, ఎయిర్ పోర్ట్ ఎండి భరత్ రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం ఏయిర్​పోర్టు ప్రారంభోత్సవ అనంతరం 28వ తేదీన కర్నూలు/ ఓర్వకల్ ఎయిర్ పోర్టు నుండి మొదటి కమర్షియల్ ఫ్లైట్ బెంగళూరుకు, అక్కడి నుంచి కర్నూలుకు వస్తుందన్నారు. అనంతరం కర్నూలు నుండి వైజాగ్ తిరిగి వైజాగ్ నుండి కర్నూలు, కర్నూలు నుండి చెన్నై తిరిగి చెన్నై నుండి కర్నూలుకు ఫ్లైట్స్ రన్ అవుతాయని… ఈ సర్వీసులు రెగ్యులర్ గా జరుగుతాయని కలెక్టర్​ జి. వీరపాండియన్​ వెల్లడించారు. మెట్రోపాలిటన్ నగరాలైన బెంగళూరు, చెన్నైలకు కూడా విమాన సర్వీసులు ప్రారంభమవుతాయన్నారు. అంతకుముందు ఓర్వకల్ విమానాశ్రయంలో ప్యాసింజర్ టెర్మినల్, రన్ వే, విఐపి లాంజ్ లను పరిశీలించారు. ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ కైలాష్ మండల్, డిఆర్డీఏ పిడి శ్రీనివాసులు, ఆర్ అండ్ బి ఎస్ ఈ జయరామి రెడ్డి, కర్నూల్ ఆర్టీవో వెంక
వెంకటేశులు తదితరులు పాల్గొన్నారు.

About Author