NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మూల క‌ణాల‌తో కృత్రిమ గ‌ర్భ‌స్థ పిండం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే తొలిసారిగా కృత్రిమ గర్భస్థ పిండాన్ని సృష్టించారు. ఈ పిండంలో మానవ పిండం మాదిరిగా అవయవాలన్ని క్రమంగా అభివృద్ధి చెందుతాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. గర్భస్థ పిండాన్ని సృష్టించడం ఏమిటి అని ఆశ్చర్యపోకండి. వాస్తవానికి పరిశోధకులు వైద్యశాలల్లో పిండాన్ని స్త్రీలోని అండాలు, పురుషుడిలోని స్పెర్మ్‌ని ఉపయోగించి కృత్రిమంగా పిండాన్ని రూపొందిస్తారు. దీన్నే టెస్ట్‌ట్యూబ్‌ బేబి అంటారు. బాహ్యంగా పిండాన్ని రూపొందించడం. కానీ ఇక్కడ మాత్రం శాస్త్రవేత్తలు వాటిని వినియోగించకుండా కేవలం స్టెమ్‌ సెల్స్‌(మూల కణాలను) వినియోగించి కృత్రిమ గర్భస్థ పిండాన్ని రూపొందించారు. ఈ మేరకు ప్రోఫెసర్‌ మాగ్డలీనా జెర్నికా నేతృత్వంలో తమ బృందం ఈ పిండాన్ని రూపొందిచినట్లు తెలిపారు. అదీకూడా మూడు వేర్వేరు మూలకణాలను తీసుకుని ఈ పరిశోధన చేసినట్లు తెలిపారు. ఆ మూలకణాల్లోని జన్యువులను పరస్పరం చర్య జరుపుకునేలా ప్రత్యేక వాతావరణాన్ని రూపొందించినట్లు వెల్లడించారు.

About Author