కట్టని రాజధాని గురించి కృత్రిమ ఉద్యమాలు !
1 min readపల్లెవెలుగువెబ్ : సీఎం జగన్ అసెంబ్లీ సమావేశాల్లో ప్రసంగించారు. వికేంద్రీకరణ అంశంపై చర్చ సందర్భంగా అమరావతి రాజధాని అంశంపై మాట్లాడుతూ, అభివృద్ధి చేయని, చేయలేని ప్రాంతం గురించి ఉద్యమం పేరుతో డ్రామాలు ఆడుతున్నారని ఘాటైన విమర్శలు చేశారు. కట్టని రాజధాని గురించి, కట్టలేని గ్రాఫిక్స్ గురించి వెయ్యి రోజులుగా కృత్రిమ ఉద్యమాలు నడిపిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎవరి బాగు కోసం ఈ ఉద్యమాలు? అని సీఎం జగన్ ప్రశ్నించారు. అమరావతి రాజధాని బడుగు బలహీన వర్గాల కోసం మాత్రం కాదని, కేవలం పెత్తందార్ల స్వీయ ప్రయోజనాల కోసమేనని ఆరోపించారు.