శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లకు ఉయ్యాల సేవ
1 min read
పల్లెవెలుగు వెబ్, శ్రీశైలం: లోకకల్యాణం కోసం శ్రీశైలదేవస్థానం అధికారులు శుక్రవారం సాయంకాలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు ఊయలసేవ నిర్వహించారు ప్రతి శుక్రవారం మరియు పౌర్ణమి, మూలనక్షత్రం రోజులలో ఊయల సేవ జరిపించబడుతోంది. కార్యక్రమంలో భాగంగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవా సంకల్పాన్ని పఠిస్తారు. తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజ , అనంతరం ఊయలలో వేంచేబు చేయించిన శ్రీస్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా షోడశోపచార పూజ చేశారు. ఆ తరువాత విశేషంగా అమ్మవారికి అష్టోత్తరం, త్రిశతి, ఖడ్గమాల, సహస్రనామపూజలు, స్వామివారికి సహస్రనామార్చన జరిపించబడుతాయి. చివరగా ఊయలసేవ నిర్వహించబడుతుంది. ఊయలసేవను పురస్కరించుకుని శ్రీస్వామి అమ్మవార్లకు విశేషంగా పుష్పాలంకరణ, పుష్పార్చనలు జరిపించబడుతాయి.