అరుణాచల క్షేత్ర దర్శనం..సూపర్ లగ్జరీ బస్సు ఏర్పాటు
1 min readపల్లెవెలుగు, వెబ్ కర్నూలు: భక్తుల సౌకర్యార్థం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, కర్నూలు-2 డిపో తమిళనాడు రాష్ట్రం లోని అరుణాచల క్షేత్రమును దర్శించుకొనుటకు, గిరి ప్రదక్షిణకు తేది : 11.11.2022 న కర్నూలు నుండి సూపర్ లగ్జరీ బస్సును నడుపుతున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాము. తేది: 11.11.2022 న, శుక్రవారం సాయంత్రం 06.00 గంటలకు బస్సు బయలుదేరి, అరుణాచలంనకు ఉదయం 04.00 గంటలకు చేరుకొనును. గిరి ప్రదక్షిణ మరియు అరుణాచలేశ్వర దర్శనం తర్వాత, అదే రోజు రాత్రి 09.00 గంటలకు బయలుదేరి, తేది: 13.11.2022, ఆదివారం ఉదయము 08.00 గంటలకు కర్నూలుకు చేరుకొనును. ఈ అరుణాచల క్షేత్ర దర్శనమునకు రాను, పోను సూపర్ లగ్జరీ బస్సులో రూ.2000/- ఛార్జిగా నిర్ణయించడమైనది. ఈ సర్వీసుకు (సర్వీసు నెం.93999) అడ్వాన్సు రిజర్వేషన్ సౌకర్యము కలదు. ముందుగా ఆన్ లైన్ లో కాని, బస్టాండు నందు కాని, అధీకృత ఏజెంట్ల వద్ద కాని రిజర్వేషన్ చేయించుకొని మీకు నచ్చిన సీట్లు పొందవచ్చును. పై బస్సు సౌకర్యాలను యావన్మంది భక్తులు పవిత్ర కార్తీక మాసములో వినియోగించుకొనవలసినదిగా కోరుచున్నాము. కావున ప్రజా సౌకర్యార్థం ఈ సమాచారాన్ని మీ పత్రికలో ప్రచురించవలసిందిగా కోరడమైనది.