సబ్సిడీ రుణాలను ఆర్యవైశ్యులు సద్వినియోగం చేసుకోండి..
1 min read
రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ నంద్యాల నాగేంద్ర
కర్నూలు, న్యూస్ నేడు: ఆర్యవైశ్యులకు ఉపాధి కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం 2024-2025 సంవత్సరానికి గాను సబ్సిడీతో కూడిన రుణాలను వివిధ వ్యాపారాల ఏర్పాటు చేసుకుని లబ్ది పొందేందుకు ఈనెల 22వ తేదీ లోపు దరఖాస్తులను ఆన్లైన్ చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ నంద్యాల నాగేంద్ర ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవ తరగతి, ఆ పైన డిగ్రీ చదివి నిరుద్యోగులుగా ఉంటున్న 21 సంవత్సరాలు నుండి 60 సంవత్సరాల వయసు లోపు వారికి కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, నివాస ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డ్ , రేషన్ కార్డు వంటి పత్రాలతో (apobmms .apcfss in) ద్వారా ఆన్ లైన్ చేసుకోవాలని లక్ష రూపాయల నుండి 5 లక్షల రూపాయల వరకు 40% నుండి 50% వరకు సబ్ స్టీల్ నాలుగు అందజేయడం జరుగుతుందని జనరిక్ మందుల షాప్ కి 8 లక్షల రూపాయల వరకు 50% సబ్సిడీతో కూడిన రుణాలను కూడా కార్పొరేషన్ ద్వారా అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఒక ప్రకటనలో తెలియజేశారు. కావున ఈ యొక్క అవకాశాన్ని ఆర్థికంగా వెనుకబడిన ఆర్యవైశ్యులు సద్విని చేసుకోవాలని ఆయన కోరారు.