PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కామాంధులకు అడ్డాగా.. వైసిపి ప్రభుత్వం    

1 min read

– అంబటి అవంతుల ఫోరెన్సిక్ లు ఏమయ్యాయో…

–టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ భట్ల సత్య సాయినాథ్ శర్మ ధ్వజం

పల్లెవెలుగు వెబ్​, కమలాపురం: హిందూపురం పార్లమెంట్ సభ్యుడు గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో మార్ఫింగ్ చేసిందని అనంతపురం పోలీస్ సూపరింటెండెంట్ ఫకీరప్ప ప్రకటించడం చూస్తూంటే  రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం కామాంధులకు అడ్డాగా మారిందని తెలుగు దేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీ భట్ల సత్య సాయినాథ్ శర్మ ధ్వజమెత్తారు. కమలాపురంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం లో వ్యవస్థలన్ని ముఖ్యమంత్రి చేతిలో కీలు బొమ్మలుగా మారిపోయాయని, ఎక్కడో లండన్ లో వీడియో మార్ఫింగ్ జరిగిందని ఎస్పీ ప్రకటించడం చూస్తూంటే రాష్ట్ర ప్రజలకు వైసీపీ ప్రభుత్వ విధానం చాలా హాస్యస్పదంగా మారిందన్నారు.  వారం రోజులు కాకముందే ఫోరెన్సిక్  రిపోర్ట్ తెప్పించి అది ఫేక్ వీడియో ఆని తెలిసిన పోలీసులు ఆ వీడియో ఎవరు తీసారో వారి వివరాలు ఎందుకు ప్రకటించలేదని ఆయన ప్రశ్నించారు. వీడియో మార్ఫింగ్ ఆని నిర్ధారించినప్పుడు మార్ఫింగ్ చేసిన వారి వివరాలు కూడా సాక్ష్యా దారాలతో సహా బయట పెట్టి ఉంటే.. వైసీపీ ప్రభుత్వ నిజాయితీని ప్రజలు నమ్మేవారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని ఫోరెన్సిక్ ల్యాబ్ కు కాకుండా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే ఫోరెన్సిక్ ల్యాబ్ కు వీడియో ను పంపి వారి చిత్తశుద్ధి నిరూపించుకోవాలనీ సూచించారు. అలాగే ప్రస్తుత రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న అంబటి రాంబాబు అలాగే మాజీమంత్రి అవంతి శ్రీనివాస్ లు మాట్లాడిన రాసలీల ల వీడియో లు ఫోరెన్సిక్ కు పంపారా అవి ఇంతవరకు రిపోర్ట్ లు రాలేదా వచ్చింటె పోలీసులు ఆ వివరాలు ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించారు. సమాజంలో మానవతా విలువలు దిగజార్చుకొని ప్రభుత్వ పరువు తీసే వారికి కూడ రాష్ట్రం లోని వైసీపీ ప్రభుత్వం అండగా నిలబడడం చాలా సిగ్గు చేటైన విషయమన్నారు.  

About Author