రాజకీయ వేదికగా.. ప్రభుత్వ కార్యాలయాలు
1 min read–టీడీపీ మండల అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి
పల్లెవెలుగువెబ్, చెన్నూరు: మండల కేంద్రంలోని మండల పరిషత్ సభా భవనంలో ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గృహ సారధులు, సచివాలయ కన్వీనర్లు, పార్టీ నాయకులతో నిర్వహించిన సమావేశంపై తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు కల్లూరు విజయభాస్కర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. మంగళవారం టిడిపి పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వం నిర్వహించే సమావేశాలు మాత్రమే నిర్వహించుకోవాల్సి ఉండగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమావేశాలు నిర్వహించడం ఏంటంటూ ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ అధికారుల సైతం అధికార పార్టీకి కొమ్ముకాస్తూ న్నారు. ప్రభుత్వ కార్యాలయంలో అనుమతులు ఎలా ఇస్తారు అని వారు ప్రశ్నించారు ప్రైవేట్ స్థలాల్లో, ఇతరత్రా ప్రైవేట్ భవనాల్లో పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకోవాలె తప్ప ప్రభుత్వ కార్యాలయాలను వాడుకోవడం సిగ్గుచేటని వారు అన్నారు. మేము కూడా టిడిపి పార్టీ సమావేశం పెట్టుకుంటామని “తెలుగు గ్రామ సేవకులు” అనే కార్యక్రమాన్ని నిర్వహించుకునేందుకు పర్మిషన్ ఇస్తారా అని వారు ఎం పి డి ఓ ప్రశ్నించారు. పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం కార్యకర్తలు అధికంగా వస్తున్నారని చాలకుండా ఉన్నందున ఎంపీడీవో కార్యాలయం లీజుకైనా సరే రోజు బాడుగకైనా సరే అధికార పార్టీ వారు ఎలా ఉపయోగించుకున్నారో అలానే మాకు కూడా ఇవ్వాలని వారు కోరారు. అనంతరం ఎంపీడీవోకు వినతిపత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు సంఘం నాయకులు మల్లికార్జున్రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇందిరెడ్డి శివారెడ్డి, మైనార్టీ నాయకులు షబ్బీర్ హుస్సేన్ ,టౌన్ కన్వీనర్ ఆకుల చలపతి, టిడిపి బీసీ సంఘం మండల అధ్యక్షుడు ఆటో బాబు, వార్డు మెంబర్ బొమ్మన శ్రీకాంత్ ,కొక్కరాయపల్లె సుధాకర్ రెడ్డి, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.