అప్రూవర్ గా.. వైఎస్ వివేకా డ్రైవర్ !
1 min readపల్లెవెలుగు వెబ్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న వైఎస్ వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి అప్రూవర్ గా మారనున్నట్టు సీబీఐ పేర్కొంది. ఈ మేరకు కడప సబ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిందితుడు దస్తగిరి అప్రూవర్ గా మారుతున్నారని, విచారణకు సహకరిస్తున్న కారణంగా అతని సాక్ష్యాన్ని నమోదు చేయాలని సీబీఐ అధికారులు కోర్టు పిటిషన్ లో పేర్కొన్నారు. కేసు పురోగతి విషయంలో సహకరించేందుకు దస్తగిరి సిద్దంగా ఉన్నాడని సీబీఐ పేర్కొంది. ఈ నేపథ్యంలో కేసు ఆసక్తికరంగా మారింది. అక్టోబర్ 26న సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. అంతకు ముందే సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, ఎర్రగంగిరెడ్డి అక్టోబర్ 22న కోర్టులో ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. అదే రోజు సీబీఐ అప్రూవర్ పిటిషన్ దాఖలు చేసింది. షేక్ దస్తగిరి 306 సెక్షన్ కింద అప్రూవర్ గా మారుతున్నారని పిటిషన్ లో పేర్కొంది.