ఆదర్శ మున్సిపాలిటీగా.. ‘రాయచోటి’
1 min read– ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్, రాయచోటి : సమిష్టి కృషితో ఆదర్శ మున్సిపాలిటీగా రాయచోటిని తీర్చిదిద్దుదామని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అధికారులు, ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. మంగళవారం రాయచోటి మున్సిపల్ కార్యాలయపు సమావేసపు హాల్ నందు మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంఎల్ సి జకియా ఖానం, మున్సిపల్ వైస్ చైర్మన్ దశరథ రామిరెడ్డితో కలిసి చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. పారిశుధ్యం, త్రాగునీటి సరఫరా, అభివృద్ధి పనులపై మున్సిపల్ అధికారులుతో శ్రీకాంత్ రెడ్డి ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పట్టణంలోని ఠాణా, నేతాజీ సర్కిల్ ల వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ పటిష్టంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ రాంబాబుకు సూచించారు. రూ 11 కోట్ల నిధులుతో చేపట్టాల్సిన 129 పెండింగ్ పనులపై ఆయన ఆరా తీశారు. మున్సిపల్ అనుమతి లేని ఇళ్ల లే అవుట్ ల పై చర్యలు తీసుకోవాలని సూచించారు. సెల్ ఫోన్ , ఇతర కంపెనీలు పైప్ లైన్ల కోసం రోడ్లును తవ్వినప్పుడు వెంటనే మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంతేకాక సమావేశంలో పలు అంశాలపై ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి చర్చించారు.