చట్టం చేసేంత వరకు … ఇళ్లకు వెళ్లం !
1 min readపల్లెవెలుగు వెబ్ : కేంద్ర ప్రభుత్వం గతంలో తీసుకొచ్చిన వ్యవసాయచట్టాలను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. కానీ రైతులు మాత్రం నిరసన కొనసాగిస్తా మంటున్నారు. సింఘ్ సరిహద్దుల్లో నిరసన కార్యక్రమాలు చేస్తున్న రైతులు తిరిగి ఇళ్లకు వెళ్లాలని ప్రధాని కోరారు. అయితే ఢిల్లీకి సమీపంలోని సింఘు సరిహద్దులో నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు.. దీనిపై చట్టం చేశాకే తిరిగి ఇళ్లకు వెళతామంటున్నారు. పార్లమెంట్ లో చట్టాలను రద్దు చేసే ప్రక్రియ ప్రారంభమైన తర్వాత మాత్రమే తాము నిరసన స్థలం నుంచి బయలుదేరుతామని రైతులు ముక్తకంఠంతో చెప్పారు. ఏడాదిగా రైతులు సింఘ్ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు మోదీ ప్రకటించారు.