PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సరస్వతి దేవిగా.. వాసవి కన్యకా పరమేశ్వరి

1 min read

 అమ్మవారిశాలలో గాంధీ జయంతి

పల్లెవెలుగు వెబ్, గడివేముల: మండల కేంద్రంలోని స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆదివారం అమ్మవారు సరస్వతి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.ఆలయ అర్చకులు వసంత లక్ష్మి సత్యనారాయణ శర్మలు ఆశ్వయుజ శుద్ధ సప్తమి ఆదివారం మూలా నక్షత్రము శ్రీ సరస్వతి దేవి అష్టోత్తర పుష్పార్చన నిర్వహించారు. అమ్మవారికి వడి బియ్యం సమర్పించి అనంతరం మహామంగళ హారతి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అలాగే గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆర్యవైశ్య సోదర సోదరీమణులు గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సోదర సోదరీమణులు పాల్గొన్నారు.

About Author