పవన్ ఉన్నంత వరకు ఆడపిల్లలు బయటికి రావొద్దు !
1 min read
పల్లెవెలుగువెబ్ : మంత్రి గుడివాడ అమర్ నాథ్ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ విశాఖలో ఉన్నంతవరకు పెళ్లికాని ఆడపిల్లలు దయచేసి బయటికి రావొద్దని అన్నారు. పెళ్లయినవాళ్లకు కూడా కట్టేస్తాడేమోనని తనకు భయంగా ఉందని, పెళ్లికాని వాళ్లే కాదు, అసలు ఆడపిల్లలనే వీధుల్లోకి పంపొద్దని మంత్రి అమర్ నాథ్ తెలిపారు. షరతులు వర్తిస్తాయి అనే లెక్కలో పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్లపై ఇప్పటికే తన విధానాన్ని చెప్పాడని, అందుకే విశాఖలో అమ్మాయిలను బయటికి రావొద్దని చెబుతున్నానని వివరణ ఇచ్చారు. ఇప్పటికే విశాఖపట్నం పవన్ కు ఓసారి పిల్లనిచ్చిందని మంత్రి గుర్తుచేశారు.