మాస్ హీరో.. లవర్ బాయ్‌గా..
1 min readసినిమా డెస్క్ : మ్యాన్లీ లుక్ తో ఉన్నా లవర్ బాయ్ కంటే .. మాస్ హీరోగానే ఎక్కువ పాపులర్ అయ్యాడు ఎన్టీఆర్. అయితే ‘బృందావనం’ మూవీ లవర్ బాయ్‌గా మెప్పించినా ఆ తర్వాత చేసినవన్నీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమాలే. అలాగే ఇప్పుడు చేస్తున్న చిత్రాలు కూడా యాక్షన్ ఓరియెంటెడ్ మూవీసే. కానీ ఎన్టీఆర్ ఇప్పుడో లవ్ ఎమోషన్ ఎంటర్ టైనర్‌కి ఓకే చెప్పాడని సమాచారం. తమిళ డైరెక్టర్ అట్లీ తారక్‌కి ఓ లవ్ సబ్జెక్ట్ వినిపించాడని. తన తొలి సినిమా ‘రాజా రాణి’ తరహాలో లవ్ అండ్ ఎమోషన్ బ్యాక్ డ్రాప్‌లో ఉంటుందని సమాచారం. తారక్ స్ర్కిప్టు నచ్చి ఓకే చెప్పాడని టాలీవుడ్ టాక్. అదీ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ కాంబో ఉండనుందనీ ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం తారక్ ‘ఆర్ఆర్ఆర్’లో రామ్ చరణ్ తో కలసి నటిస్తున్నాడు. తర్వాత త్రివిక్రమ్, ప్రశాంత్ నీల్ సినిమాలు లైన్‌లో ఉంచాడు. అట్లీ ఏమో బాలీవుడ్‌లో షారూఖ్ ఖాన్‌తో మూవీ చెయ్యడానికి రెడీగా ఉన్నాడు. ఈ లెక్కన అట్లీ తారక్‌ల కాంబోలో మూవీ రావాలంటే చాలా టైమ్ పట్టేట్టు ఉంది. కానీ ప్రభాస్ నాగశ్విన్ మూవీకంటే ముందు ఓం రౌత్ ‘ఆదిపురుష్’ చేస్తున్నట్టు ఎన్టీఆర్ కూడా యాక్షన్ సినిమాల మధ్యలో రిలీఫ్ కోసం లవ్ డ్రామా మొదలుపెడితే మాత్రం ఈ ప్రాజెక్ట్ త్వరలోనే పట్టాలెక్కే అవకాశం ఉంటుంది.