మోదీ గడ్డం పెరిగినట్టు.. పెట్రోల్ ధరలు పెరిగాయి !
1 min readపల్లెవెలుగు వెబ్ : పెట్రోల్ ధరల పెంపుపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. తిరుపతిలోని ఓ పెట్రోల్ బంక్ వద్ద ఓ ఛానల్ రిపోర్టర్ అవతారం ఎత్తి.. పెట్రోల్ ధరల పెరుగుదలపై ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. పెట్రోల్ ధర పెరుగుదల వల్ల తాము ఏ విధంగా ఇబ్బందిపడుతున్నామో ప్రజలు నారాయణకు వివరించారు. మోదీ గడ్డం పెరిగినట్టు పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయని నారాయణ విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని నారాయణ డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ పై పన్నులు వేయడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని ఆయన విమర్శించారు.