తిండి కోసం సెక్స్ వర్కర్లుగా .. !
1 min readపల్లెవెలుగువెబ్ : శ్రీలంక ప్రజలు తినడానికి తిండిలేక పస్తులుండాల్సిన దుస్థితి వచ్చింది . ఇప్పుడు అక్కడి మహిళల పరిస్థితి అత్యంత దయనీయంగా మారినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ప్రత్యేకించి వస్త్రపరిశ్రమలో పనిచేసే మహిళలు ఉద్యోగం పోతుందేమోననే భయంతో వ్యభిచార వృత్తిలోకి దిగుతున్నట్లు పేర్కొన్నాయి. కొలంబో ప్రాంతంలో ఈ ఏడాది జనవరి నుంచి ‘ఆయుర్వేద స్పా’ల ముసుగులో వ్యభిచార గృహాలు పుట్టుకొస్తున్నాయి. ఇటీవల వీటి సంఖ్య గణనీయంగా పెరిగింది. సెక్స్ వర్కర్లుగా చేరుతున్న మహిళల సంఖ్య 30 శాతం వృద్ధి చెందింది అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దాదాపు వీరంతా వస్త్రపరిశ్రమ రంగంలో పనిచేసిన వారే కావడం గమనార్హం.