ఆమె మాట్లాడుతుండగా.. అసెంబ్లీలో చిడతలు కొట్టిన సభ్యులు !
1 min read
పల్లెవెలుగువెబ్ : ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాల సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే విడదల రజనీ మాట్లాడబోతున్న సమయంలో టీడీపీ సభ్యులు అడ్డుకుని చిడతలు కొడుతూ భజన చేశారు. సభలో చిడతలు కొట్టిన టీడీపీ సభ్యులపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ఈ విధంగా వ్యవహరించడం కరెక్టేనా అంటూ మండిపడ్డారు. టీడీపీ సభ్యుల చేతుల్లో నుంచి చిడతలు తీసుకోవాల్సిందిగా సభాపతి ఆదేశించారు. మరోవైపు టీడీపీ సభ్యులు సభలో చిడతలు కొట్టడంపై వైసీపీ నేతలు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చివరకు చంద్రబాబుకు చిడతలు కొట్టుకోవాల్సిందేనంటూ వ్యాఖ్యలు చేశారు.