పోర్న్ చూసే వారి సంఖ్య పెరిగిందట !
1 min readపల్లెవెలుగు వెబ్ : లాక్ డౌన్ కారణంగా పిల్లలు, పెద్దలూ అందరూ ఇంటికే పరిమితం అయ్యారు. స్కూళ్లు మూతపడటంతో పిల్లలకు ఆన్ లైన్ క్లాస్ లు తప్పనిసరి అయ్యాయి. దీంతో ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్, ల్యాప్ టాప్, ట్యాబ్ ల అవసరం ఏర్పడింది. స్థోమత ఉన్నవారు ల్యాప్ టాప్ , టాబ్లెట్లు కొంటే.. స్థోమత లేనివారు ఫోన్లతో సరిపెట్టుకున్నారు. మరికొందరు ఉన్న ఫోన్లనే ఆన్ లైన్ క్లాసులకు వాడుకున్నారు. ఆన్ లైన్ క్లాసుల నేపథ్యంలో ఎక్కువ మంది పిల్లలు ఫోన్లు, ల్యాప్ ట్యాప్ లు వాడటంతో అశ్లీల చిత్రాలు చూసేవారి సంఖ్య కూడ పెరిగిందని ఓ సర్వేలో తేలింది. ఆన్ లైన్ క్లాస్ ల నిమిత్తం ఫోన్లు, ల్యాప్ టాప్ లు వాడుతున్నప్పుడు పోర్న్ పాప్ అప్ లు వస్తుంటాయి. వాటి మీద క్లిక్ చేసినప్పుడు వెంటనే పోర్న్ ప్రపంచంలోకి వెళ్లిపోతున్నారు. దీంతో పిల్లలు తమకు తెలియకుండానే పోర్న్ కి అలవాటు పడిపోతున్నారు. పోర్న్ చూడటం వల్ల పిల్లల్లో అనేక దుష్ప్రభావాలు కలుగుతాయని, వీటి ప్రభావం పిల్లల్లో పెరుగుతుందని సైకియాట్రిస్టులు చెబుతున్నారు. ఇప్పటికే పోర్న్ సైట్లను కేంద్రప్రభుత్వం నిషేధించింది. వీటిని బ్లాక్ చేయాలని టెలికం సంస్థలను ఆదేశించింది. అయినా కూడ ఫలితం లేదు.
తల్లిదండ్రులు ఓ లుక్కేయండి !
పిల్లలు ఫోన్లు, ల్యాప్ టాప్ లు వాడుతున్న సమయంలో వారిని అలా వదిలేయకుండా ఓ కన్నేసి ఉండాలని నిపుణులు చెబుతున్నారు. పిల్లలను పట్టించుకోకపోతే వారు ఇలాంటి వాటికి బానిసలయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు. పిల్లలు ఏం చూస్తున్నారు.. ఏం చేస్తున్నారు అన్న విషయాన్ని నిరంతరం పర్యవేక్షించాలని చెబుతున్నారు.