పాకిస్థాన్ కు అసదుద్దీన్ వార్నింగ్ !
1 min read
పల్లెవెలుగువెబ్ : కర్ణాటకలో చెలరేగిన హిజాబ్ వివాదంపై పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మహమూద్ ఖురేషీ చేసిన వ్యాఖ్యలపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌లోనే అనేక సమస్యలు ఉన్నాయని, ముందు వాటి సంగతి చూసుకోండని, ఇండియా తమ దేశమని ఇక్కడ వేలు పెట్టాలని చూస్తే ప్రతిఫలం అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు.