PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అసత్యమేవ జయతే వైసీపీ ప్రభుత్వ నినాదం…

1 min read

వైసీపీ అవినీతిని ప్రశ్నిస్తే అక్రమ కేసులా..?

చంద్రబాబు నాయుడు అరెస్టు దుర్మార్గపు చర్య.

40ఏళ్ల రాజకీయ చరిత్రలో మచ్చలేని నేత చంద్రబాబు నాయుడు.

సత్యమేవ జయతే దీక్ష కు మద్దతుగా టీడీపీ మహిళలు దీక్షలు.

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు:  అసత్యమేవ జయతే అనేదే వైసీపీ ప్రభుత్వ నినాదమని  రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడం దుర్మార్గపు చర్య అని నందికొట్కూరు నియోజకవర్గ టిడిపి నాయకులు నంద్యాల పార్లమెంట్  ఇంచార్జి మాండ్ర శివానంద రెడ్డి, నందికొట్కూరు ఇంచార్జి గౌరు వెంకట రెడ్డి    పేర్కొన్నారు.మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గాంధీ కి   ఘనంగా నివాళులర్పించారు అనంతరం  చంద్రబాబు  రాజమండ్రి సెంట్రల్ జైలులో చేపట్టిన సత్యమేవ జయతే దీక్షకు మద్దతుగా  టిడిపి జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు ను నిరసిస్తూ సోమవారం నందికొట్కూరు లో  20వ రోజు  పట్టణ  టిడిపి తెలుగు మహిళా నాయకురాలు ప్రభావతమ్మ  ,రాజేశ్వరి ల  ఆధ్వర్యంలో నందికొట్కూరు  సామూహిక రిలే నిరాహారదీక్ష చేపట్టడం జరిగింది . కార్యక్రమానికి నంద్యాల పార్లమెంట్ ఇంచార్జ్ మాండ్ర శివానందరెడ్డి   నందికొట్కూరు నియోజకవర్గ ఇంచార్జ్ గౌరు వెంకటరెడ్డి పాల్గొని  సంఘీభావం తెలిపారు.  ఈ  సందర్భంగా టీడీపీ మహిళా నాయకురాలు సిఎం డౌన్‌డౌన్‌, సైకో పోవాలి.. సైకిల్‌ రావాలి, అంటూ నినాదాలు చేశారు. మాండ్ర శివానంద రెడ్డి ,గౌరు వెంకట రెడ్డి లు  మాట్లాడుతూ  స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి 16 నెలలు జైలులో ఉన్నాడని, కనీసం ఒక్కరోజైనా చంద్రబాబును జైల్లో ఉంచాలన్న కుట్రతోనే అరెస్టు చేశారని విమర్శించారు. ప్రజాస్వామ్యానికి ఇది చీకటి రోజని అన్నారు. సిఎం జగన్‌ రాజ్యాంగానికి, వ్యవస్థలకు తూట్లు పొడిచేలా చంద్రబాబును అరెస్టు చేశారన్నారు. 40ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో మచ్చలేని నేత చంద్రబాబు సిఎంగా, ప్రతిపక్ష నేతగా రాష్ట్రానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారన్నారు. ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేని నాయకుడిని అరెస్టు చేయడం చూస్తుంటే జగన్‌ కళ్లల్లో ఆనందం కోసమే సిఐడీ, కొందరు పోలీసు అధికారులు పనిచేస్తున్నట్లు అర్ధమవుతోందని అన్నారు. కార్యక్రమంలో  టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గిత్త జయసూర్య, మాజీ ఎంపీపీ ప్రసాద్ రెడ్డి,     మండల కన్వీనర్  ఓబుల్ రెడ్డి, పలుచాని మహేశ్వర రెడ్డి,కాతా రమేష్ రెడ్డి, గిరీశ్వర రెడ్డి, వెంకటేశ్వర్లు యాదవ్, నందికొట్కూరు అధికార ప్రతినిధి కాకరవాడ చిన్న వెంకట స్వామి, బండి జయరాజు,   టీడీపీ నాయకులు సురేంద్ర నాథ్ రెడ్డి , గంజాయి నాగముని, జమీల్, రసూల్,   అల్లూరు సర్పంచి నాగ లక్ష్మయ్య,  లక్ష్మీకాంత్ రెడ్డి, రంగ స్వామి, హరీష్ రెడ్డి ,మల్లికార్జున రెడ్డి, మాజీ సర్పంచి ఖాల్లిలుల్లా బెగ్, మా బెగ్, కౌన్సిలర్ భాస్కర్ రెడ్డి, టీడీపీ నాయకులు జాకీర్ , ఐ టీడీపీ నాయకులు మూర్తుజావలి, మాణిక్య రాజు , ముజిబ్, అంజి బాబు , మద్దయ్య, ఐటీడీపీ పాలమర్రి నాగరాజు,పగడం శేఖర్, నరసింహారెడ్డి, సోషల్ మీడియా కో ఆర్డినేటర్  సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.

About Author