ఆశ సమీక్ష సమావేశం..
1 min readపల్లెవెలుగు వెబ్ ప్యాపిలి: ఆశ సమీక్ష సమావేశం డాక్టర్. వాణిశ్రీ వారి ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్యాపిలి నందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి కుష్ఠు వ్యాధి అనుమానిత కేసెస్ ఆన్ లైన్ సర్వే 100% వెంటనే కంప్లీట్ చేయాలని, ఆర్ సి ఎచ్ పోర్టల్ లో గర్భిణీ స్రీలు, భాలింతల నమోదు ఆన్ లైన్ లో చేయాలి అని,ప్రపంచ కాన్సర్ వ్యతిరేక దినం సందర్భంగా కాన్సర్ వ్యాధి గురించి అవగాహన, అందరికి కాన్సర్ పరీక్షలు అనే నినాదం ను ప్రజలలోకి తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించడం. అదేవిధంగా జాతీయ నులిపురుగులు నివారణ కార్యక్రమం 10-02-2025 తేదీన నిర్వహించడం,ఆ ప్రోగ్రామ్ నందు ఒక సంవత్సరము నుండి 18 సంవత్సరముల వరకు అన్ని అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాల లు,కళాశాలలో పిల్లలందరికి ఒక సంవత్సరం వారికి 200 మిలిగ్రాముల, 2- 18 సంవత్సరం ల వారికి 400 మిలిగ్రాములు ఆల్బండాజోలు మాత్రలు నమిలి,మింగించాలని ఆదేశించడం జరిగింది.కార్యక్రమం లో ఆరోగ్య విదభోదకుడు రాఘవేంద్ర గౌడు, గంగాదేవి, మనోహర్ రెడ్డి, ప్రసన్న, శ్రీనివాస్, రోజా ఎం ఎల్ ఎచ్ పి లు, ఏ ఎన్ ఎం లు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.