రైతులను హత్య చేసిన ఆశిష్ మిశ్రాను శిక్షించాలి : సీపీఎం
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు :శాంతియుతంగా ఆందోళన పోరాటాలు చేస్తున్న రైతులపై అధికార మదం తో కేంద్ర మంత్రి తనయుడు ఆశిష్ మిశ్రా రైతులపై కారుతో తొక్కించి హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు సిపిఎం సీనియర్ నాయకులు కే రాజగోపాల్ , నగర కార్యదర్శి వర్గ సభ్యులు, ముహమ్మద్ షరీఫ్, అబ్దుల్ దేశాయ్, అల్ ఇండియా లాయర్ అసోసియేషన్ జిల్లా నాయకులు ,వి రవి కుమార్. ఆదివారం కర్నూలు నగరంలోని మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ చౌక్ సర్కిల్ వద్ద అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఖాజా పాషా అధ్యక్షతన జరిగిన సభలో వారు మాట్లాడుతూ మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. ఉత్తరప్రదేశ్ లఖింపూర్‌లో ఉద్యమం చేస్తున్న రైతులపై కారు ఎక్కించడం దారుణమన్నారు.
రైతుల హత్యకు కారణమైన కేంద్ర సహాయ మంత్రి కొడుకు ఆశిష్ మిశ్రాను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం నగర నాయకులు, డి పార్వతయ్య ,కరీం భాష, మళ్లీ, సిఐటియు నగర నాయకులు రాంబాబు, మధు ఖలీల్ ,గౌస్ ,ఇస్మాయిల్ మద్దిలేటి, గోరా, మత్తయ్య ,రాజు ఈశ్వర్, ఇలియాస్, పెయింటర్ యూనియన్ నాయకులు చాంద్ భాషా , షుకుర్, అబ్బూబకార్, మహబాష ,జావిద్. తదితరులు పాల్గొన్నారు.