PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘అశోకా’ కాలేజ్ కి ప్రతిష్టాత్మక  NAAC ‘A+’ గుర్తింపు..

1 min read

– అత్యధికంగా  ‘3.49’ CGPA స్కోర్ సాధింపు

– రాష్ట్రంలోని అన్ని’ఉమెన్స్’ ఇంజనీరింగ్ కాలేజీల కంటే హయ్యస్ట్ స్కోర్ సాధించిన ‘అశోకా’ కాలేజ్

– స్టుాడెంట్స్,పేరెంట్స్ & స్టాఫ్ కి శుభాకాంక్షలు తెలియజేసిన ‘అశోకా’ ఛైర్మన్ K.అశోక్ వర్ధన్ రెడ్డి.

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: స్ధానిక ‘కర్నూలు’ పట్టణంలోని ‘అశోకా’ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ నకు దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ‘న్యాక్(NAAC)’ కౌన్సిల్ నుండి అత్యుత్తమ ‘A+’ గుర్తింపు సాధించడంతో పాటుగా ‘3.49’ CGPA స్కోర్ తో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ఇతర ‘ఉమెన్స్’ ఇంజనీరింగ్ కాలేజ్ ల కంటే హయ్యస్ట్ గా నిలిచిందని ‘అశోకా’ కాలేజ్ ఛైర్మన్ శ్రీ. K.అశోక్ వర్ధన్ రెడ్డి శనివారం నాడు పత్రిక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా శనివారం నాడు ‘అశోకా’ కాలేజ్ ఆడిటోరియం నందు జరిగిన కార్యక్రమంలో ‘అశోకా’ కాలేజ్ ఛైర్మన్ శ్రీ. K.అశోక్ వర్ధన్ రెడ్డి, డైరెక్టర్ డా.హరీస్ క్రిష్ణ, ప్రిన్సిపాల్ డా.నవీన్ హజరై మాట్లాడుతూ..’జాతీయ అంచనా, అక్రెడిషన్ మండలి(NAAC)’ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా గల కాలేజీలలో పర్యటించి వాటి నాణ్యతా ప్రమాణాలపై ఇచ్చే గుర్తింపు ప్రక్రియ లో మన ‘కర్నూలు’ కి చెందిన ‘అశోకా’ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అత్యుత్తమ ‘A+’ గుర్తింపు సాధించడంతో పాటుగా ‘3.49’ CGPA స్కోర్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ‘ఉమెన్స్’ కాలేజీల కంటే హయ్యస్ట్ స్కోర్ సాధించి A.P లోనే ‘నెం.1 ఉమెన్స్ కాలేజ్’ గా మరోసారి సత్తా చాటిందని, ఈ అత్యద్భుత విజయాన్ని సాధించుటకు సహకరించినందుకు మా కాలేజ్ ‘స్టుాడెంట్స్’ మాపై అపార నమ్మకాన్ని ఉంచిన ‘పేరెంట్స్’, మరియు ఇందుకు అన్ని విధాల కృషి చేసిన వివిధ విభాగాల అధిపతులు, టీచింగ్ & నాన్-టీచింగ్ స్టాఫ్ కి వారు హృదయపూర్వక కృతజ్ఞతలు’ తెలిపారు.  అనంతరం జరిగిన కార్యక్రమంలో కాలేజ్ స్టాఫ్ కేక్ కట్ చేసి, బాణసంచా కాల్చి ఆనందంగా సంబరాలు చేశారు.

About Author