అందుబాటులో ఆశ్రo ఆసుపత్రి వైద్య సేవలు
1 min read– మాజీ ఉపముఖ్యమంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని
పల్లెవెలుగు, వెబ్ ఏలూరు : సాధారణ ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో ఏలూరు ఆశ్రం ఆసుపత్రి యాజమాన్యం ఏలూరులో బ్రాంచ్ ని స్థాపించడం ఎంతో అభినందనీయమని మాజీ ఉపముఖ్యమంత్రి, శాసనసభ్యులు ఆళ్ళ నాని అన్నారు. స్థానిక ఆర్ఆర్ పేటలో నూతనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశ్రం ఆసుపత్రి ఎన్నో సంవత్సరాలుగా ప్రజలకు అత్యంత తక్కువ ఖర్చుతో సేవలందిస్తున్న విషయం తెలిసిందేనన్నారు. ప్రజలందరూ కూడా సేవలను వినియోగించుకోవాలన్నారు. ఆశ్రమ ఆసు పత్రి డైరెక్టర్ రతీదేవి మాట్లాడుతూ ఆశ్రమ ఆసుపత్రిలో పేద ప్రజలకు ఎన్నో విశేష సేవలు అందించడం జ రిగిందన్నారు. ఈ నూతన బ్రాంచిలో ఉదయం 9 గంటల నుండి 4 గంటల వరకు జనరల్ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉంటాయ న్నారు. సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ విద్యా సంవత్సరం నుండి 150 సీట్లు నుండి 250 సీట్లు పెంచడం జరిగిందన్నారు. ఉభయ గోదావరి జిల్లాలో 1200 పడకల ఏకైక ఆసుపత్రి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ డైరెక్టర్ కె. అంజిరెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ అడ్మిన్ డాక్టర్ చేబ్రోలు శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాల్ అకడమిక్ డాక్టర్ జె. వేణుగోపాల్ రాజు, డిప్యూటీ సూపరింటెండెంట్ కె. ఎస్.ఎస్. జి.సి. కుమార్, ప్రొఫెసర్ మరియు హెచ్డి ఎస్.పి.ఎమ్. ఎన్. పార్ధసారధి,డైరెక్టర్ నీరవ్ వర్మ తదితరులు పాల్గొన్నారు.