ఏసియా కుబేరుడు.. ఒక్క రోజులో అదాని స్థానం తారుమారు !
1 min readపల్లెవెలుగువెబ్ : ఏసియా కుబేరుడిగా మారిన గౌతమ్ అదానీ స్థానం ఒక్క రోజులోనే తారుమారు అయింది. బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ జాబితాలో ఏసియా ధనవంతుడి స్థానాన్ని ముఖేశ్ అంబానీ మరోసారి పదిలం చేసుకున్నారు. గత 24 గంటల వ్యవధిలో ఇద్దరి సంపదలో తేడా రావడంతో స్థానాలు తారుమారు అయ్యాయి. 2022 ఫిబ్రవరి 9 బుధవారం ఉదయం బ్లూంబర్గ్ ఇండెక్స్ జాబితాలో ముకేశ్ అంబానీ సంపద 89.2 బిలియన్ డాలర్లకుగా నమోదు అయ్యింది. క్రితం రోజు ఈ విలువ 87.9 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక గౌతమ్ అదానీ సంపద 86.3 బిలియన్ డాలర్లుగా ఉంది. మునపటి జాబితాలో ఈ మొత్తం 88.5 బిలియన్లుగా ఉండేది. ఒక్క రోజు వ్యవధిలో ముకేశ్ సంపదలో 1.33 బిలియన్ డాలర్లు వచ్చి జమ అవగా అదానీ ఖాతా నుంచి 2.16 బిలియన్ డాలర్లు కరిగిపోయాయి. దీంతో ముకేశ్ ఏషియా నంబర్ 1 స్థానంతో పాటు ప్రపంచం కుబేరుల్లో పదో స్థానానికి మరోసారి చేరుకున్నారు.