PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైద్యం.. పోష్టికాహారం పై ఆరా…

1 min read

– ప్రత్యేక అధికారులు ప్రతి శుక్ర శనివారాలలో తమ మండలాల్లో అభివృద్ధి, సంక్షేమ అమలు తీరుపై పర్యవేక్షించాలి..

– అమలు తీరును పర్యవేక్షిస్తున్న అధికారులు..

పల్లెవెలుగు  వెబ్ ఏలూరు జిల్లా :  మండల ప్రత్యేక అధికారులు వారంలో ప్రతీ శుక్రు, శనివారాలు తమ మండలంలో పర్యటించి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును పర్యవేక్షించాలన్న జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ ఆదేశాల మేరకు జిల్లాలోని పలు అధికారులు శుక్రవారం  మండలాల్లో పర్యటించి, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, తదితర కేంద్రాలను పరిశీలించారు.  జిల్లా మైనారిటీస్ సంక్షేమ అధికారి కృపావరం దెందులూరు మండలం దెందులూరు గ్రామంలోని సచివాలయం-2 పరిధిలోని  అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించి, మహిళలకు, పిల్లలకు అందుతున్న పౌష్టికాహారాన్ని పరిశీలించారు.  బరువు తక్కువ ఉన్న పిల్లలను పరిశీలించారు.  వారి తల్లితండ్రులను కలిసి వారికి అందిస్తున్న పౌష్టికాహారం వివరాలను అడిగి తెలుసుకున్నారు.  జిల్లా ఉద్యానవనాలు శాఖాధికారి రామమోహన్ రావు నూజివీడు మండలంలోని బొరవంచ గ్రామంలో అంగన్వాడీ, వైద్య సిబ్బందితో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం ద్వారా అంగన్వాడీ సిబ్బంది పోష్టికాహారం అందిస్తున్నది లేనిదీ అడిగి తెలుసుకున్నారు.   పసు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ జి. నెహ్రు బాబు అంగన్వాడీ, వైద్య సిబ్బందితో కలిసి చాట్రాయి మండలంలోని చిన్నంపేట గ్రామంలోని పాఠశాలను సందర్శించి, రక్తహీనత తో బాధపడుతున్న చిన్నారుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి అందిస్తున్న వైద్యం, పోష్టికాహారం పై ఆరా తీశారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు, మహిళలకు అందిస్తున్న పౌష్టికాహార కిట్ల వివరాలను అడిగి తెలుసుకుని, ఆ గ్రామంలోని ఇంటింటికి వెళ్లి అంగన్వాడీ సిబ్బంది ద్వారా అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు.

About Author