NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అడ‌గ‌ను… పెడితే సంతోషిస్తా !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : వ‌ంగ‌వీటి రంగా త‌న‌యుడు, టీడీపీ నేత వంగ‌వీటి రాధాకృష్ణ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. వంగ‌వీటి రంగా జిల్లా ఏర్పాటు చేయ‌డం పై ఆయ‌న స్పందించారు. వంగ‌వీటి రంగా పేరు ఓ జిల్లాకు పెడితే సంతోషిస్తాన‌ని, ఆయ‌న కుమారుడిగా అభ్య‌ర్థించ‌న‌ని తెలిపారు. ‘‘నా తండ్రిని కులమతాలకు అతీతంగా ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. రంగా అంటే పోరాటానికి దిక్సూచి, పేదల పాలిట పెన్నిధి. రంగా ఒక్క‌జిల్లాకే పరిమితం కాదు.. రాష్ట్రం మొత్తం ఆరాధిస్తుంది. రంగా చరిత్ర గురించి ప్రత్యేకంగా ఎవరూ చెప్పనక్కర్లేదు. రంగా అభిమానులు అంతా ఏకమైతే ప్రభుత్వాలే కూలిపోవడం ఖాయం. రంగా శిష్యులు, అభిమానులు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. వారు కూడా జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టేలా కృషి చేయాలి. ఏపదవి, హోదా ఇవ్వని గౌరవం నాకు రంగా గారి అబ్బాయిగా దక్కింది. పదవులు ఐదేళ్లకు మారిపోవచ్చు. రంగా కొడుకుగా ప్రజలు చూపించే అభిమానం అనంతం. ఈ జన్మకు రంగా కొడుకు అనే ఆదరణే నాకు సంతృప్తి.’’ అని వంగవీటి రాధాకృష్ణ అన్నారు.

                                    

About Author