NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆఫ‌ర్ కోసం ప‌వ‌న్ ను అడిగా..!

1 min read

కోట శ్రీనివాస‌రావు.. తెలుగు తెర మీద మ‌కుటంలేని మ‌హా న‌టుడు. పాత్ర పోషిస్తే… అందులో జీవించిపోతాడు. తెలుగు కళామ‌త‌ల్లి ముద్దుబిడ్డ..క‌ళ‌లే జీవితంగా బ‌తికిన గొప్పన‌టుడు. అయితే.. వ‌య‌సు మీద ప‌డుతున్న కొద్దీ.. అవ‌కాశాలు త‌క్కువ‌వుతున్నాయ‌ని విచారం వ్యక్తం చేశారు ఇటీవ‌ల ఓ ఇంట‌ర్యూలో. లాక్ డౌన్ లో ఇంట్లో కూర్చుని.. బోర్ గా ఫీల‌య్యాన‌ని తెలిపారు. సినిమాల్లో అవ‌కాశం కోసం ప‌వ‌న్ క‌ళ్యాణ్, చిరంజీవితో పాటు.. మ‌రికొంద‌రు ద‌ర్శకుల్ని అడిగినట్టు తెలిపారు. అయితే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్, క్రిష్ కాంబినేష‌న్ లో రాబోయే చిత్రంలో ఓ పాత్ర చేస్తున్నట్టు తెలిపారు. చాలా రోజుల త‌ర్వత ప‌వ‌న్ సినిమాలో అవ‌కాశం రావ‌డం ఆనందంగా ఉంద‌ని… అవ‌కాశాలు వ‌స్తే తాను న‌టించ‌డానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు సీనియ‌ర్ న‌టుడు కోట శ్రీనివాస‌రావు.

About Author