PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ది బీన్స్ కాఫీ అండ్ బేకరీ కేఫ్ ను ప్రారంభించిన ఏఎస్పీ

1 min read

పల్లెవెలుగువెబ్​, ఏలూరు: కొత్తదనాన్ని కోరుకునే ఏలూరు నగర వాసులకు సరికొత్త రుచులను పరిచయం చేసేందుకు ది బీన్స్ కాఫీ అండ్ బేకరీ రెస్టారెంట్ ను యాజమాన్యం ఏర్పాటు చేసినట్లు జిల్లా అడిషనల్ ఎస్పీ డాక్టర్ ఓ. దిలీప్ కిరణ్ తెలిపారు.ఏలూరు అశోక్ నగర్ లోని ముక్కుతిమ్మన రోడ్ నందు ది బీన్స్ కాఫీ అండ్ బేకరీ  రెస్టారెంట్ ను శుక్రవారం ఉదయం జిల్లా అడిషనల్ ఎస్పీ దిలీప్ కిరణ్ ప్రారంభించారు.ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ వినియోగదారులకు నాణ్యమైన, రుచికరమైన మంచి ఆరోగ్య కరమైన ఆహార పదార్థాలను అందించాలని సూచించారు. నూతన వ్యాపార ప్రారంభోత్సవం సందర్భంగా బీన్స్ కాఫీ అండ్ బేకరీ కేఫ్ ప్రోప్రయిటర్ గుదే.సందీప్ గాంధీ మాట్లాడుతూ ఏలూరు నగర వాసులకు ప్రశాంతమైన వాతావరణంలో మంచి హై క్వాలిటీ ఫుడ్ అందించాలనే తపనతో ఏలూరు పరిసర ప్రాంతాల్లో రెండవ కేఫ్ ను ప్రారంభించినట్లు తెలిపారు.ఈ కేఫ్ లో పెద్ద నగరాలకే పరిమితమైన హై క్వాలిటీ కాఫీ మా ప్రత్యేకత అని అన్నారు. అలాగే మంచి కాఫీలతోపాటు అనేక రకాలైన కేక్స్, షేక్స్ ,పిస్టరిష్ ,మాక్ టైల్స్ , కొంటినెంటల్ , ఎపిటైజర్ , తోపాటు అనేక సరికొత్త రుచులను పరిచయం చేస్తున్నట్లు తెలిపారు. అలాగే సోమవరప్పాడు ఎన్ హెచ్-16 , టొయోటా సర్వీస్ సెంటర్ వద్ద ఫ్లాట్ నెంబర్ 202,203 నందు గతంలో బీన్స్ కాఫీ అండ్ బేకరీ కేఫ్ ను ప్రారంభించామని అన్నారు. అందరి ఆదరాభిమానాలతో ఆ కేఫ్ చాలా బాగా నడుస్తోందన్నారు.ఏలూరు నగర పరిసర ప్రాంతాల వాసులు ఈ సధవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో గుదే.సందీప్ గాంధీ కుటుంబ సభ్యులు గుదే.గాంధీ రావు, మేడిద.ఝాన్సీ బాయి, 28వ డివిజన్ కార్పొరేటర్ బండారు. కిరణ్, నగర ప్రముఖులు పాల్గొన్నారు.

About Author