రష్యా అధ్యక్షుడి పై హత్యాయత్నం
1 min readపల్లెవెలుగువెబ్ : రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై హత్యాయత్నం జరిగింది. పుతిన్ బాడీగార్డులే ఆయనను చంపేయడానికి ప్రయత్నించారు. బాంబు దాడికి పాల్పడ్డారు. అయితే, పుతిన్ సురక్షితంగా బయటపడ్డారు. ఈ మేరకు యూరో వీక్లీ న్యూస్ సంచలన కథనాన్ని ప్రచురించింది. జనరల్ జీవీఆర్ పేరుతో ఉన్న ఓ టెలిగ్రామ్ చానల్‌లోని సమాచారం ఆధారంగా కథనాన్ని రాసింది. ఈ కథనం ప్రకారం.. పుతిన్ తన నివాసానికి వెళ్తుండగా ఆయన కాన్వాయ్‌కు ఓ అంబులెన్స్ అడ్డం వచ్చింది. ఆ తర్వాత కాన్వాయ్‌లో ఉన్న ఓ వాహనం ఆగకుండా వెళ్లిపోయింది. పుతిన్ ప్రయాణిస్తున్న లిమోసిన్ కారుపై బాంబుదాడి జరిగింది.