అమ్మకానికి 8 ప్రభుత్వ కంపెనీల ఆస్తులు !
1 min readపల్లెవెలుగువెబ్ : హెచ్‌ఎంటీ బేరింగ్స్ లిమిటెడ్ సహా 8 ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను ఈ ఆర్థిక సంవత్సరంలో విక్రయించాలని మోదీ సర్కారు భావిస్తోంది. కీలకేతర రంగాల పీఎస్ యూల పునరుద్ధరణ, విక్రయ ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం వీటిని అమ్మకానికి పెట్టాలనుకుంటోంది. భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఈ ఎనిమిది పీఎ్‌సయూలు ఆర్థికంగా దివాలా తీసిన కారణంగా ఇప్పటికే మూతపడ్డాయి. ఈ జాబితాలో హెచ్‌ఎంటీ బేరింగ్స్‌తో పాటు హెచ్‌ఎంటీ వాచెస్, హెచ్‌ఎంటీ చినార్ వాచెస్, హిందుస్తాన్ కేబుల్స్, తుంగభద్ర స్టీల్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, భారత్ పంప్స్ అండ్ కంప్రెసర్స్, స్కూటర్స్ ఇండియా, నేషనల్ బైస్కిల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉన్నాయి.