అసైన్డ్ భూములు.. అమ్ముకోవడానికి హక్కులు
1 min readఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి
మంత్రాలయం, పల్లెవెలుగు: అసైన్డ్ భూములను అమ్ముకోవడానికి లబ్ధిదారులకు సర్వహక్కులు కల్పించిన ఘనత సీఎం జగన్ దే అని మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని రాంపురం గ్రామంలో షెడ్యూల్ కాస్ట్ వారికి భూమి కొనుగోలు పథకం కింద ప్రభుత్వం కొనుగోలు చేసి ఇచ్చిన భూములకు సర్వ హక్కులు కల్పించి రిజిస్ట్రేషన్ పత్రాలను ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మండలం సూగురు, చిలకలడోన, మాధవరం, రచ్చమర్రి, బసాపురం, రాంపురం గ్రామాలలో ఉన్న 162 మంది దళితులకు అసైన్డ్ భూములపట్టాలు మంజూరు చేయడమే కాకుండా లబ్ధిదారులు అవసరం వచ్చినప్పుడు అమ్ముకోవడానికి హక్కులు కల్పించడం జరిగిందన్నారు. గతంలో జగన్ మోహన్ రెడ్డి తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి జీఓ 492 అసైన్డ్ భూముల రుణాలు రద్దు చేస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జీఓ 51 తో అసైన్డ్ భూములను అమ్ముకోవడానికి హక్కులు కల్పించడం జరిగిందన్నారు. మీరు ఆలోచించాలి ఎవరు దళితులకు న్యాయం చేస్తారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి ని ముఖ్యమంత్రి గా, నన్ను ఎమ్మెల్యే గా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీనివాసమూర్తి, తహసీల్దార్ చంద్ర శేఖర్, మండల ఇన్ చార్జ్ విశ్వనాథ్ రెడ్డి, ఆర్ ఐ ఆనంద్, వీఆర్వో లు సూగురు శ్వేత, చిలకలడోన ప్రభాకర్,మాధవరం నవ్య, బసాపురం పవన్, చిలకలడోన సర్పంచ్ హనుమంతు, ఎంపిటిసి అంజి అధికారులు, ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.