మత్స్యకారులకు భరోసా..
1 min readవారి జీవితాల్లో వెలుగు నింపేందుకే..
– అర్హులైన ప్రతి కుటుంబానికి రూ. 10వేలు ఆర్థిక సహాయం
– రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్, కడప : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న “ వైఎస్ఆర్ మత్స్యకార భరోసా ” పథకం మత్స్యకారులు, ఆక్వా రైతుల జీవితాల్లో మరింత వెలుగులు నింపుతోందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుండి “వైఎస్ఆర్ మత్స్యకార భరోసా” పథకం కింద సముద్రంలో చేపల వేట నిషేధ సమయంలో జీవనోపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు రూ. 10వేలు వారి అకౌంట్లలో సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి జమ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కరోనా నేపద్యంలో లాక్ డౌన్ ఆర్థిక భారం ఉన్నప్పటికి … ఇచ్చిన ప్రతి హామీని బాధ్యతగా నెరవేరుస్తూన్నామన్నారు. వైఎస్ ఆర్ మత్స్యకార భరిశాపధకం క్రింద 2019 నుండి ఇప్పటివరకు రూ. 211.70 కోట్లు భృతి లబ్దిదారులకు చెల్లించడం జరిగిందన్నారు. వరుసగా 3 వ ఏడాది నేడు అందిస్తున్న రూ. 119.88 కోట్లతో కలిపి మొత్తం దాదాపు రూ. 332 కోట్ల లబ్దిని చేకూర్చినట్ల ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అనంతరం వివిధ అంశాలపై అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమానికి కలెక్టరేట్ విసి హాలు నుండి జిల్లా జాయింట్ కలెక్టర్ (రైతుభరోసా, రెవెన్యూ) ఎం.గౌతమి, మత్స్య శాఖ డిడి నాగరాజు, అనుబంధ శాఖల అధికారులు, పాల్గొన్నారు.