మలివయస్సులో.. ఆరోగ్యం పదిలం..
1 min read50 ఏళ్లు దాటిన వారు ఏడాదికోసారి ఫ్లూ టీకా వేసుకోవాలి
- పౌష్టిక ఆహారం, వ్యాయామంతోపాటు వ్యాక్సిన్.. తప్పనిసరి…
- సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ జి. భవాని ప్రసాద్, ఎండి,కర్నూలు
కర్నూలు, పల్లెవెలుగు:50 ఏళ్లు దాటిన ప్రతిఒక్కరిలోనూ వ్యాధినిరోధక శక్తి తగ్గుతూ వస్తుందని, ఆ క్రమంలో వ్యాధినిరోధక శక్తి పెంచుకునేందుకు ఏడాదికోసారి (ఇన్ఫ్లూ యన్జా) ఫ్లూటీకాను తప్పనిసరిగా వేసుకోవాలని సూచించారు సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ జి. భవాని ప్రసాద్ ఎండి. కర్నూలు. ఆదివారం కర్నూలు నగరం ఏ క్యాంపులోని హార్ట్ ఫౌండేషన్ కార్యాలయంలో మెడికల్ విద్యార్థులక ‘ అడల్ట్ వ్యాక్సినేషన్’పై అవగాహన సదస్సు నిర్వహించారు. హార్ట్ ఫౌండేషన్ ప్రధాన సెక్రటరి, హార్ట్ అండ్ బ్రెయిన్ మల్టీ హాస్పిటల్ అధినేత, సీనియర్ కార్డియాలజి డా. చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన సదస్సులో డా. భవాని ప్రసాద్ ఎండి మాట్లాడారు. 50 ఏళ్ల దాటిన వారు …వృద్ధాప్యంలోకి వెళ్తుంటారని, ఆ క్రమంలో వ్యాధి నిరోధక శక్తి పెంచుకునేందుకు వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఆయాసం, ఊబసం, బీపీ, షుగర్ , దగ్గు ( ఊపిరితిత్తులు, గుండెకు సంబంధించిన వ్యాధులు) దరి చేరవన్నారు. ఒక వేళ సదరు వ్యాధులు వచ్చినా… వ్యాధి నిరోధక శక్తితో త్వరగా కోలుకుంటారన్నారు.
న్యూమోనియో.. వ్యాక్సిన్…:
అదేవిధంగా న్యూమోనియో వ్యాక్సిన్ వేసుకోవం వల్ల గుండె, మూత్రపిండాలకు సంబంధించి వ్యాధులు రావన్నారు.
అదేవిధంగా హెచ్పివి వ్యాక్సిన్‌తో 9 నుంచి 14 ఏళ్లలోపు బాలికలు గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ వచ్చే అవకాశం లేదని ఈ సందర్భంగా సీనియర్ ఫిజిషియన్ డా. భవాని ప్రసాద్ ఎండి స్పష్టం చేశారు. పౌష్టిక ఆహారం, ప్రతి రోజు వ్యాయామం చేయడంతోపాటు వ్యాక్సిన్ కూడా వేసుకోవాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.