NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తొగట వీర క్షత్రియులు ఐక్యంగా ఉండాలి

1 min read

–రాష్ట్ర తోగట వీర క్షత్రియ సంఘం అధ్యక్షులు మోడంవీరాంజనేయ ప్రసాద్

పల్లెవెలుగు వెబ్​, అన్నమయ్య జిల్లా రాయచోటి:రాయచోటి నియోజకవర్గం లోని సుండుపల్లె మండలం బూడిద వాండ్లపల్లి నందు వెలసిన శ్రీ శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు తొగట వీర క్షత్రియ కుల సంఘం మండల కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగినది. ఈ కార్యక్రమంలో మండలంలోని మారుమూల గ్రామాల నుంచి కూడా తొగట కులానికి చెందిన ప్రజలు అనేకమంది హాజరయ్యారు. ముఖ్య అతిథిగా వీరాంజనేయ ప్రసాద్ (తొగట వీర క్షత్రియ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు) గారి చేతుల మీదుగా మండల స్థాయి కమిటీ ప్రమాణస్వీకారం జరిగినది. బొమ్మిశెట్టి రెడ్డప్ప అధ్యక్షులు, రెబ్బ తిరుమలయ్య ఉపాధ్యక్షులు, భోజనపు సురేంద్ర ఉపాధ్యక్షులు, ముద్దుశెట్టి ధన శేఖర్ ప్రధాన కార్యదర్శి, పెద్దకోట్ల వెంకటేష్ ఆర్గనైజర్ సెక్రెటరీ, లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మోడం  వీరాంజనేయ ప్రసాద్ రాష్ట్ర అధ్యక్షులు, కుర్ర వెంకటరమణ రాష్ట్ర అధ్యక్షులు, బొమ్మిశెట్టి కృష్ణమూర్తి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బొమ్మిశెట్టి వెంకటరత్నంరాయలసీమ అధ్యక్షులు, భోజనపు వెంకటరమణ అధ్యక్షులు అన్నమయ్య జిల్లా, రామిశెట్టి రత్నం, సిద్దాల విజయభాస్కర్ మాజీ వైస్ చైర్మన్, కళ్యాణ్ రెడ్డప్ప సుండుపల్లె మండలం టిడిపి అధ్యక్షులు, రెబ్బ శివయ్య కోఆర్డినేటర్, అనేకమంది కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

About Author