PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జిల్లాలో …ఇంటింటి సర్వే 25% మాత్రమే జరిగింది

1 min read

– జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .సృజన

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ సృజన  రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో ఏజెంట్లు ఇంటింటి సర్వేలో పాల్గొనవలసిందిగా కోరినారు.మంగళవారం సాయంకాలం జిల్లా ఎన్నికల అధికారి డా.జి సృజన  రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం మినీ కాన్ఫరెన్స్ హాల్ నందు నిర్వహించినారు .ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యంగా పత్రికలలో ప్రతికూల వార్తలు రావడం సహజం .వాటిని ఆధారంగా చేసుకుని జరుగుతున్న తప్పులను సరిదిద్దుకోవడానికి అవకాశం లభిస్తుందని తెలిపారు . కర్నూలు జిల్లాలో ప్రస్తుతము ఇంటింటి సర్వే 25% మాత్రమే జరిగిందని రాష్ట్రం మొత్తం ఇదేవిధంగా 25% ఉందని తెలిపారు.ఆదోని మరియు కర్నూలు  మున్సిపల్ కార్పొరేషన్లలో ఇంటింటి సర్వేలో ఒక్కొక్క ఇంట్లో అధికంగా ఓటర్లు ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి కారణం ఒక ఇంటి నంబర్ లో వేరే వేరే నివాస గృహాలు ఉంటాయి . వాటిలో ఎక్కువ మంది ఉండే అవకాశం ఉంటుంది. ఓకే ఇంటి నెంబర్ ఉండడం వల్ల ఆ ఇంటిలో ఉన్న కుటుంబాల ఓటర్లు ఎక్కువగా ఆగుపడతారు. దీనికిగాను రాష్ట్ర ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు బి.ఎల్.ఓ లు  సర్వే చేస్తున్నప్పుడు ఆ ఇంటి కి అదనముగా ఇంటి నెంబర్లు కేటాయించి సరి చేస్తారని తెలిపారు . ఈ విషయంపై  ఈ.ఆర్.ఓ. లకు , ఏ.ఈ.ఆర్.ఓ. లకు మరియు బీ.ఎల్.ఓ. లకు సరి అయిన శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు. కావున రాజకీయ పార్టీల ఏజెంట్లు బి.ఎల్.ఓ. లతో ఇంటింటి సర్వేలో పాల్గొన్నట్లయితే జరుగుతున్న  ప్రక్రియ లో సందేహాలు తొలగిపోతాయని తెలిపారు.రాజకీయ పార్టీల ఏజెంట్లు ఒకే సారి 10 కంటే ఎక్కువ ఫారంలు ఓటర్లుగా చేర్చడానికి కానీ తొలగించడానికి  కాని ఇవ్వటానికి వీలు లేదని తెలిపారు. ప్రక్రియ మొత్తానికి 30 ఫారాల కంటే ఎక్కువ ఇవ్వటానికి లేదని తెలిపారు.జిల్లాలో మరణించిన ఓటర్ల లిస్టుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వారి మరణ ధ్రువపత్రాలు లేదా పంచ నామాలు ఆధారంగా చేసుకుని అన్ని రికార్డులు సమకూర్చుకొని మరణించిన వారి ఓట్లను తొలగిస్తామని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.జిల్లా మొత్తంలో జరుగుతున్న ఇంటింటి సర్వేలో ఓటర్లుగా నమోదు చేయడం మరియు తొలగించడం వంటి విషయాలను ఆటోల నందు సౌండ్ సిస్టం ద్వారా ప్రచారం చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తామని జిల్లా ఎన్నికల అధికారి రాజకీయ పార్టీ ప్రతినిధులకు తెలియజేశారు.ఈ సమావేశానికి జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య , డి.ఆర్.ఓ నాగేశ్వరరావు , ఎలక్షన్స్ సెల్ సూపరింటెండ్ మురళి , కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి సత్యనారాయణ గుప్తా , బీ.ఎస్.పి  పార్టీ జిల్లా ఇన్చార్జి అరుణ్ కుమార్ పాల్గొన్నారు.

About Author